ప్రశాంత్ కిషోర్ రాజకీల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. పొలిటికల్ ఎనలిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్ …ప్రధానమంత్రిగా మోడీ ఎంపికవడం దగ్గరి నుంచి ఇటీవల ఏపీలో జగన్,ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రావడం వరకు కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ సీఎం ,తమిళనాడులో కమల్ తరపున పనిచేస్తున్నారు.
తాజాగా కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రశాంత్ కిశోర్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను తర్వాత వెల్లడిస్తానని కుమారస్వామి వెల్లడించారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్ధానాన్నే గెలుపొందింది. పార్టీ సీనియర్ నేత,మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఓటమి పాలయ్యారు.