కుమారి ఆంటీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించే చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో భోజన ప్రియులు ఆమె షాపుకు పోటెత్తారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపించారు.
అయితే రోజురోజుకు పబ్లిక్ పెరిగిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండటంతో రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు.
దీనిపై తనదైన శైలీలో స్పందించారు బీఆర్ఎస్ నేతలు. కుమారి ఆంటీ పొట్ట కొట్టింది ఎవరు ?,కుమారి ఆంటీ హోటల్ మూసేసింది ఎవరు ?,ఆమె మీద కేసు పెట్టింది ఎవరు?,పబ్లిసిటీ చేసుకుంటున్నది ఎవరు? చెప్పాలని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్ పోలీసులు తప్పు చేశారా?,వాళ్ళు చేసింది కరెక్ట్ ఐతే సీఎం చేసేది తప్పా, ఒప్పా ?ఒక సీఎం స్పందించేంత తప్పు చేస్తే చర్యలు ఉండవా పోలీసుల మీద ?
సీఎం గారు ట్రాఫిక్ పోలీసులను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారా? అని బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
కుమారి ఆంటీ పొట్ట కొట్టింది ఎవరు ?
కుమారి ఆంటీ హోటల్ మూసేసింది ఎవరు ?
ఆమె మీద కేసు పెట్టింది ఎవరు?
పబ్లిసిటీ చేసుకుంటున్నది ఎవరు?ట్రాఫిక్ పోలీసులు తప్పు చేశారా?
వాళ్ళు చేసింది కరెక్ట్ ఐతే సీఎం చేసేది తప్పా, ఒప్పా ?
ఒక సీఎం స్పందించేంత తప్పు చేస్తే చర్యలు ఉండవా పోలీసుల మీద ?… pic.twitter.com/Lhkoso3kzJ— YSR (@ysathishreddy) January 31, 2024
Also Read:మార్నింగ్ వాక్..అనేక రోగాలకు చెక్!