ప్రధానమంత్రిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు కర్నాటక సీఎం కుమారస్వామి. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కర్నాటక సీఎం..జేడీఎస్ రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు కృషి చేస్తుందన్నారు.
కోల్‌కతాలో తాను అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి మద్దతివ్వాలన్నది తమ పార్టీ నిర్ణయమని, దీన్ని వె గౌడ బలపరుస్తున్నారని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీలలో చాలామంది సమర్థులైన నాయకులు ఉన్నారని.. మాయావతి, మమత ఇందుకు ఉదాహరణ అని మాత్రమే నేను అన్నానని తెలిపారు. నరేంద్ర మోడీ కేవలం కాగితం పులి మాత్రమేనని, అయితే, రాహుల్ చాలా పరిపక్వతగల నాయకుడని కుమారస్వామి కీర్తించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొన్న కుమారస్వామి..మమతను ప్రధాని పదవికి సమర్ధురాలైన నాయకురాలిగా అభివర్ణించిన విషయం తెలిసిందే.