కర్ణాటక సీఎంగా బుధవారం రోజు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రమణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి వర్గ విస్తరణపై ఇరు పార్టీలు చర్చిస్తున్నాయి. సీఎం పదవి జేడీఎస్ కు ఇచ్చారు కావున డిప్యూటీ సీఎం పదవికి కాంగ్రెస్ కే ఇవ్వాలని కొరుతున్నారు. మంత్రి వర్గ విస్తరణపై మరో రెండు మూడు రోజుల్లో ఓ క్లారిటి రానుంది. ఇక పదవులపై చర్చించడానికి నేడు ఢిల్లికి వెళ్లిన కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, అధ్యక్షులు రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా భేటీ అనంతరం ఆయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. మంత్రి పదవులపై ఇరు పార్టీలో జోరుగా రాజకీయాలు నడుస్తున్నాయి.
గాంధీ కుటంబం మీద ఉన్న గౌరవంతోనే తాను ఢిల్లీకి వచ్చి సోనియా, రాహుల్ ను కలిశానన్నారు కుమారస్వామి. బుధవారంరోజు ముఖ్యమంత్రి పదవికి తాను చేయబోయే ప్రమాణ స్వీకారాణికి సోనియా, రాహుల్ ఆహ్వానించానని..అందుకు వారు కూడా ఒప్పకున్నట్లు తెలిపారు. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణపై తమ పార్టీ తరపున రాహుల్ గాంధీ …కాంగ్రెస్ నేత, కర్ణాటక జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కి అనుమతి ఇచ్చారని, మంత్రి వర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయనకు అప్పగించారన్నారు కుమారస్వామి. డిప్యూటీ సీఎం అంశంపై రేపు వేణు గోపాల్ తమ పార్టీ నేతలతో తుది సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.