నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలతో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని అలాగే జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో కుమ్రం భీం కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన దీరోదాత్తమైన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొండకోనలోని ప్రజలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జల్… నిన్న కంటికి రెప్పలా కాపాడుకుంటున్న జంగిల్ రాష్ట్రంలో 7.70శాతం పెరిగిందని….నేడు 1.51లక్షల మందికి ఏకంగా 4.60లక్షల ఎకరాల జమీన్(భూమి)ని పంచుతున్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read: Tamilnadu:గవర్నర్ ఆసాధారణ చర్య.. రాజ్యాంగ విరుద్ధం డీఎంకే..!
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రజాపనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తండాలను గ్రామ పంచాయితీల ఏర్పాటుతో మావనాటే మావరాజే స్వప్నం సాకారమైందని అన్నారు. పదిశాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని కొనియాడారు. ఇలా ఒకటా.. రెండా.. పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన-ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి, పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read: CMKCR:షెడ్యూల్ విడుదల…
నీళ్ళు..
నిధులు..
నియామకాలు..
అనే ఉద్యమ నినాదాలనే కాదు..జల్..
జంగల్..
జమీన్…
అనే కుమ్రం భీం కలలను కూడా..అక్షరాలా..
సాకారం చేసిన..
ధీరోదాత్తమైన నాయకుడు..
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…మొన్న
కొండకోనల్లోని నివాసాలకు
మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్"నిన్న
కంటికి రెప్పలా… pic.twitter.com/WZOZQrTDUf— KTR (@KTRBRS) June 30, 2023