యార్క్‌షైర్..అదరగొట్టిన కుల్దీప్ !

3
- Advertisement -

2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత వన్డే జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్న 31 ఏళ్ల కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతను రాయల్ వన్డే కప్ 2026 టోర్నమెంట్‌లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

యార్క్‌షైర్ తరఫున ఆడుతున్న కుల్దీప్ తన తొలి మ్యాచ్‌లోనే బలమైన ముద్ర వేసాడు. గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మొత్తం 2-39 గణాంకాలతో నిలిచాడు. మ్యాచ్ మధ్యలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆయన, 41 డాట్ బాల్స్ వేసి తన చివరి ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. అలెక్స్ హార్టన్ (30 పరుగులు, 42 బంతులు) మరియు జామీ మెక్‌ఇల్‌రాయ్ (డకౌట్) లను పెవిలియన్‌కు పంపాడు. గ్లామోర్గాన్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే పరిమితం చేయడంలో కుల్దీప్ బౌలింగ్ అత్యంత కీలకంగా మారింది.

ఈ ప్రదర్శన భారత వన్డే జట్టులో కుల్దీప్ పునరాగమనంపై చర్చను మరింత బలపరిచింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం, ఈ నిర్ణయంపై నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 2027 వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో, కుల్దీప్ తన అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగించి భారత వన్డే జట్టులోకి తిరిగి రావాలని భావిస్తున్నాడు.

యార్క్‌షైర్ మరియు గ్లామోర్గాన్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. గ్లామోర్గాన్ జట్టును 186 పరుగులకే కట్టడి చేసిన యార్క్‌షైర్, లక్ష్య ఛేదనలో అద్భుత ప్రదర్శన చేసి అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆడమ్ లీత్ 10 పరుగులు, విలియం లక్స్టన్ 24 పరుగులు చేశారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ

- Advertisement -