చినుకులతో పోటిపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

193
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అన్నివర్గాలకు చేరువయ్యింది. ప్రకృతిని ప్రేమించే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన ఇండియన్ బాట్మింటన్ ప్లేయర్ కుహూగార్గ్ ఈ రోజు డెహ్రాడూన్ లోని తన స్వగృహంలో మూడు మొక్కలను నాటరు. అనంతరం కుహూగార్గ్ మాట్లాడుతూ..ఈ భూమికి పచ్చని తోరణాన్ని కట్టడానికి ప్రతీ ఒక్కరం మొక్కలు నాటాలని నాటిన ప్రతీ మొక్కని సంరక్షించి భావి తరాలకు అందివ్వాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తనను నామినేట్ చేసిన కోచ్ అరుణ్ విష్ణుకి అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త ఎంపీ సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశారు,ఛాలెంజ్ అందుకున్న వారిలో లక్ష్య సేన్,సాత్విక్ రాజ్,పూర్విశారాం లు ఉన్నారు.

- Advertisement -