ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపులకు రాష్ట్రంలో అద్భుత స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాల వరకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ‘జనతా కర్ఫ్యూ’లో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆదివారం సెలవు కావడం, స్వచ్ఛం దంగా ప్రజలు కరోనాపై యుద్ధం ప్రకటించడంతో రాష్ట్రమంతా 144 సెక్షన్ తలపించింది.
కాగా, అన్ని రాష్ట్రాల్లోకెల్లా ‘తెలంగాణ’ జనతా కర్ఫ్యూను పాటించి, మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇందుకు నిదర్శనం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వతహాగా.. సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలుపడమే. కాగా, రాష్ట్ర ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించి.. జనతా కర్ఫ్యూను పాటించి, విజయవంతం చేశారు. ప్రధాని పిలుపుకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది.
రాష్ట్ర ప్రజలు చూపిన చొరవకు రాజ్యసభ సభ్యులు ‘జోగినిపల్లి సంతోష్ కుమార్’ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల యూనిటీకి ఇదొక నిదర్శనమని ఈ సందర్భంగా ఎంపీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారతీయులుగా మనం కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించామని పేర్కొన్నారు.
ప్రధాని సూచించినట్లు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇంటి ఆవరణలోకి వచ్చి చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరు చూపిన చొరవ ప్రశంసించదగిన విషయమని ఆయన తెలిపారు.
This is an example of extraordinary act. We, #Indians have proved that if we stand together, we can achieve anything.
Kudos to all of you for making the #JanataCurfew a grand success.
Let’s destroy #Covid2019 with same enthusiasm. #ThankYouHyderabad#ThankYouTelangana pic.twitter.com/AjiksYT2zO
— Santosh Kumar J (@MPsantoshtrs) March 22, 2020