ఆసక్తిరేపుతున్న‘కుడి ఎడమైతే’ ట్రైలర్..

28
Kudi Yedamaithe Trailer

అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కుడి ఎడమైతే’. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. జూలై 16న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

ఇందులో అమలా పాల్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిగా కనిపించారు. ఆమె జీవితంలో జరిగిందే పదే పదే జరుగుతుంది. ఆమెలాగే మరో వ్యక్తికి కూడా ఇలాగే జరుగుతుంది. ఈ క్రమంలో వీరిద్దరూ టైం లూప్‌లో ఇరుక్కుంటారు. ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారని తాజాగా ట్రైలర్‌తో అర్థమవుతోంది.

Kudi Yedamaithe Trailer | Amala Paul, Rahul Vijay | Pawan Kumar | People Media | Premieres Today 5pm