ధనుష్ కుబేర రిలీజ్ డేట్!

2
- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . జూన్ 20న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానుండగా ధ‌నుష్ ఇందులో బిచ్చ‌గాడి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరా: నికేత్‌ బొమ్మి.

ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

Also Read:వీడియో..అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం

- Advertisement -