దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు. అందాల నటి శ్రీదేవి(54) దుబాయ్‌లో గుండెపోటుతో శనివారం రాత్రి కన్నుమూశారు. శ్రీదేవి మరణంతో భారతీయ సినీపరిశ్రమ విశాదంలో మునిగిపోయింది. సినీ,రాజకీయ ప్రముఖులు శ్రీదేవి కుటుంబానికి సంతాపం తెలిపారు. శ్రీదేవి హఠాన్మరణం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం షాక్‌కు గురి చేసిందన్నారు కేటీఆర్. రెండేళ్ల క్రితం టెక్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీదేవి హాజరయ్యారు. నాటి ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. శ్రీదేవి వినయం తనను ఎంతో ఆకట్టుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసుకున్నమహా నటి శ్రీదేవి అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని ..అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షకలోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. ఆమె భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఆమె కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యాన్ని ఆ భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
https://twitter.com/KTRTRS/status/967637417523011584