తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని అందించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను గుర్తు చేసుకుంటూ వీరిద్దరూ ట్వీట్ చేశారు.
అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఈ సందర్భంగా జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ‘‘మహాకవి కాళోజి చెప్పినట్టుగా పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నట్టు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహామనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గదర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు’’ అని హరీష్ రావు ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ కోసం తపించిన మహా మనిషి ప్రొఫెసర్ జయశంకర్ అంటూ హరీష్ ట్వీట్ చేశారు.
జయ శంకర్ సార్ యాదిలో !!
పుట్టుక మీది..చావు మీది..బతుకు తెలంగాణ ది!! 🙏
To the man who struggled all his life for Telangana #Respect pic.twitter.com/23hhyKUvvL
— KTR (@KTRTRS) August 6, 2019
తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పిన మహోపాధ్యాయులు, ఆజన్మాంతం తెలంగాణనే స్వప్నించి, శ్రమించిన కర్మయోగి తెలంగాణ దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు. మహాత్మా మీరు చూపిన తోవలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు పునరంకితమవుతాం. pic.twitter.com/decMvCvjgu
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 6, 2019
మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు pic.twitter.com/N320XMoo6V
— Harish Rao Thanneeru (@trsharish) August 6, 2019