ఎంపీ కవితకు శుభాకాంక్షల వెల్లువ..

308
ktr kavitha harish rao
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పుట్టినరోజు ఇవాళ. నేటితో 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మహిళా నేతకు శుభాకాంక్షలు చెప్పారు టీఆర్ఎస్‌ నేతలు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

ఎంపీ కవితక్క స్పెషల్ బర్త్ డే సాంగ్…

కవిత పుట్టినరోజు సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొన‌సాగాల‌ని కేటీఆర్ ఆశీర్వ‌దించారు. కవితకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పిన ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌విత‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు.

- Advertisement -