కేటీఆర్‌…వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏడాది

705
ktr trs
- Advertisement -

టీఆర్ఎస్ యువనేత, సీఎం కేసీఆర్‌ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పార్టీ బాధ్యతలను స్వీక‌రించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన పనితీరు,విజయాలపై ఇప్పుడు పార్టీలో చర్చజరుగుతోంది.

ktr

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన ఏడాది కాలంలో తన మార్క్‌ను స్పష్టంగా చూపించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, క్యాడర్‌కు దగ్గరై నాయకత్వంతో సమన్వయం చేస్తూ పార్టీ విజయవంతంగా ముందుండి నడిపించారు.

Image result for ktr

పార్లమెంట్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలతోపాటు హుజుర్‌నగర్ ఉపఎన్నికలో పార్టీ విజయబావుటా ఎగుర‌వేయ‌డం కేటీఆర్‌ది కీ రోల్. 60 లక్షల సభ్యత్వాలతో టీఆర్ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టడంలో రామన్నది కీలకపాత్ర. పార్టీపై కార్యకర్తల్లో భరోసా కల్పించడంతో పాటు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకుసాగుతున్నారు కేటీఆర్‌. ఫలితంగా 32 జిల్లాల జడ్పీలపై టీఆర్ఎస్ జెండా ఎగిరింది.

Image result for ktr

ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ బిల్లులు, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ కేటీఆర్ ముందుకుసాగారు. దీంతో పాటు 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేయడంతో పాటు బూతు కమిటీల ఎంపికతో టీఆర్ఎస్‌ నిర్మాణంలో కీ రోల్ పోషించారు. మొత్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏడాది కాలం పూర్తిచేసుకున్న కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -