“వెంకీ మామ”పై మహేశ్ బాబు ప్రశంసలు

450
Mahesh Babu Venkymama

విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం వెంకీ మామ. బాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈమూవీ ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలైంది. తాజాగా వెంకీ మామ సినిమాపై స్పందించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.

‘వెంకీ మామ సినిమా ఫుల్ ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ సినిమాలో ప్రతీ బిట్‌ని నేను, నా ఫ్యామిలీ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. వెంకటేష్ గారు, చైతూల మధ్య కెమిస్ట్రీ సిల్వర్‌ స్క్రీన్‌కి ఓ వెలుగులా ఉంది. ఇందులో సెంటిమెంట్‌కి, ఎమోషన్స్‌కి, కామెడీకి ముఖ్యంగా ఫ్యామిలీకి ఇచ్చిన వ్యాల్యూస్ సూపర్‌గా ఉన్నాయి. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. డి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈచిత్రం బాక్షాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.