నేను ఛోటా భీమ్ అభిమానినే అని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ టీవీ రూపొందించిన కార్టూన్ క్యారెక్టర్ ఛోటా భీమ్ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కిడ్స్ సూపర్ హీరో ఛోటా భీమ్ అని తెలిపారు.
ఛోటా భీమ్ పాత్ర ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిందన్నారు.ఇలాంటి కార్టూన్స్ పాత్రలతో పిల్లలకు యానిమేషన్ రంగంపై ఆసక్తి కలుగుతుందని చెప్పారు. యానిమేషన్ ఇండస్ట్రీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని తెలిపారు. గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ యానిమేషన్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ టవర్స్ ను హైదరాబాద్‌లో నిర్మిస్తామని చెప్పారు. ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన కోరారు.ఛోటా భీమ్ అంటే తెలియని పిల్లలు ఉండరు. ఓ కార్టూన్ చానెల్‌లో ప్రసారమైన ఛోటా భీమ్ సీరియర్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటూ.. కిడ్ సూపర్‌హీరోగా పదేళ్లు పూర్తి చేసుకుంది.