ఇద్దరూ కలిసి పట్టారు.. ఔట్ చేశారు…వైరల్ వీడియో…

203
Mayank Agarwal & Manoj Tiwary Great Team Catch Of Ben Stokes
- Advertisement -

ప్రతిసారి ఐపీఎల్‎లో కొందరు ఆటగాళ్లు ఊహకందని రీతిలో ఫిల్డింగ్, బ్యాటింగ్‎లతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ ఐపీఎల్‎లో కూడా అదే జోరు కొనసాగుతుంది. నిన్న రాజస్థాన్, కింగ్స్ ఎలెవన్ జరిగిన మ్యాచ్‎లో మయాంక్ అగర్వాల్ పట్టిన క్యాచ్‎కి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 11 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కొద్ది సేపటికి సంజూ శాంసన్ ఔటైన తర్వాత బెన్ స్టోక్స్ బ్యాటింగ్‎కు దిగాడు.

Mayank Agarwal & Manoj Tiwary Great Team Catch Of Ben Stokes

ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 9 బంతుల్లో 12 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో ముజీబ్ వేసిన చివరి బంతిని కూడా భారీ షాట్ బాదాడు. అయితే లాంగ్ ఫీల్డింగ్‎లో ఉన్న మయాంక్… స్టోక్ అందించిన క్యాచ్‎ని కల్లు చెదిరే రీతిలో పట్టి అందరిని ఆశ్చర్యపరిచి ఔరా అనిపించాడు. సిక్స్ అనుకున్న తరుణంలో మయాంక్ క్యాచ్ అందుకుని.. బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో అక్కడే ఫిల్డింగ్‎లో ఉన్న మనోజ్ తివారీకి బంతిని విసిరి బెన్ స్టోక్స్‎ని మైదానం వీడేలా చేశారు. మయాంక్ పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

నిన్నటి మ్యాచ్‎లో రాజస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (84నాటౌట్‌; 54బంతుల్లో 7×4, 3×6) చివరి వరకూ నిలిచి ఒంట్టి చేత్తో మ్యాచ్‎ని గెలిపించాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న రాజస్థాన్‎కి నిన్నటి ఓటమితో ప్లేఆఫ్‌ ఆశలు దాదాపు దూరమైనట్లే.

- Advertisement -