టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2001 ఏప్రిల్ 27న ఒక వ్యక్తి ప్రారంభించిన సాహసోపేత ప్రస్ధానం ఇప్పుడు చరత్రగా మారిందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగ జరుగుతున్నాయి. ఊరూ,వాడవాడలా గులాబీ జెండాను ఎగరేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు,నాయకులు.
2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం అట్టహాసంగా జరిగింది. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాట కృషి ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది. కొత్త రాష్ట్రంలో అధికారం మళ్లీ పరాయి పార్టీల పాలైతే, తెచ్చుకున్న తెలంగాణకు అర్థమే ఉండదని టీఆర్ఎస్‌ను పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా నిర్మించారు కేసీఆర్. విజయసాధనే లక్ష్యంగా గులాబీ దండును సమాయత్తం చేశారు.
ఈ ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కనివినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. యావత్ దేశం ఇటువైపు తలతిప్పి చూసేలా చేసింది. ఆ విశ్వాసంతోనే ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌కు అఖండ విజయాన్ని అందించారు.తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ముందుకుసాగుతున్నారు.
“मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर
लोग साथ आते गये और कारवां बनता गया”What began as one man’s courageous journey on 27th April, 2001 is now legendary
Greetings to millions of TRS grassroots leaders & people of Telangana on the 18th foundation day of @trspartyonline 🙏 pic.twitter.com/FgZlWGfwpc
— KTR (@KTRTRS) April 27, 2019