క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం.సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాధించుకున్నాడు. అలుపెరుగని క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అవార్డులు.. మరెన్నో రికార్డులు అందుకున్నాడు. ఇటీవల సచిన్‌ను ఓ అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌ను చేర్చారు. అయితే ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సచిన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సచిన్‌తో కలిసి గతంలో దిగిన ఫొటోతో కేటీఆర్ విషెష్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 87 మంది ఆటగాళ్లు ఇప్పటి వరకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోగా మన దేశం తరఫున బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్‌దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018)కి మాత్రమే హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇంగ్లండ్‌కి చెందిన ఆటగాళ్లు ఇందులో 28 మంది ఉండడం గమనార్హం. ఇప్పుడీ జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు.
Many congratulations to the amazing @sachin_rt on being inducted in the #ICCHallOfFame 🙏 pic.twitter.com/12hkEf3CSt
— KTR (@KTRTRS) July 20, 2019