భారతదేశపు మొట్టమొదటి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
భారతీయ స్పేస్-టెక్ రంగం నుండి 1 బిలియన్ డాలర్ల (సుమారు ₹8,000 కోట్లు) కంటే ఎక్కువ విలువ గల స్టార్టప్‌గా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది.హైదరాబాద్ కేంద్రంగా, టీ-హబ్‌లో ప్రారంభమై, ఇంత తక్కువ సమయంలో ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం.
మన తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది గర్వకారణం అన్నారు.
భారతీయ ప్రతిభకు, ఆశయాలకు ఉన్న అపారమైన శక్తికి ఇది ఒక నిదర్శనం…భివిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.. పవన్ కుమార్ చందన, భరత్ దాకా మరియు స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.తెలంగాణను మరియు భారతదేశాన్ని ఇలాగే గర్వపడేలా చేస్తూ ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.


