విలక్షణ నటుడిగా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. విలన్ పాత్ర అయినా, క్యారెక్టర్ రోల్ అయినా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించిన ప్రకాష్ రాజ్..సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకునే నటుడిగా గుర్తింపుపొందారు.
ఇప్పటివరకు సమకాలిన రాజకీయాలపై తనదైన శైలీలో స్పందించిన ప్రకాష్ రాజ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం కానుకగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరనని స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.
మీ అందరి మద్దతుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ..ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానన్నది.. త్వరలో ప్రకటిస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో ప్రజా ప్రభుత్వం రానుందని.. చివర్లో #Citizensvoice #Justasking పార్లమెంట్‌లో కూడా అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు.
ప్రకాష్ రాజ్ రాజకీయ అరంగేట్రంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు ప్రకాష్‌కు విషెస్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో రాణించాలని ఆశిస్తూ విషెస్ చెప్పారు.
Congratulations @prakashraaj on the decision to enter public life. Let your journey be all about bringing positive change; Wish you good luck https://t.co/VDEQoJod7A
— KTR (@KTRTRS) January 2, 2019