ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోందన్నారు.వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్ లకు, వారి తల్లితండ్రులకు శుభాభినందనలు…సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త అని ఎక్స్ ద్వారా వెల్లడించారు.
ప్రతిష్టాత్మక సివిల్స్ లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉంది..సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు.
తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు.
వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో… pic.twitter.com/X0BLXXIZYh
— KTR (@KTRBRS) April 17, 2024