ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. బస్తీ దవాఖాన పరిశీలనలో భాగంగా ఖైరతాబాద్‌లో పర్యటించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో ఎందుకు వచ్చింది? .. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేకపోతున్నరు.. వాళ్ళకి సిగ్గనిపిస్తలేదా? చెప్పాలన్నారు.
నాడు కేసీఆర్ హయాంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు కేటీఆర్. వాటితో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తేవడం జరిగింది… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి, ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అన్నారు.
4-5 నెలలుగా బస్తీ దవాఖానాలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు… బస్తీ దవాఖానాలలో మందు గోళీలు కూడా అందుబాటులో లేవు,…ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో దీనితో అర్థమవుతుంది అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం, ఇబ్రహీం నగర్ లోని బస్తీ దవాఖానను పరిశీలించారు కేటీఆర్.
Also Read:దీపావళి..70 మందికి గాయాలు

