మున్సిపాల్టీల అభివృద్దికి కృషి చేయాలి-కేటీఆర్‌

235
KTR Video Conference With Municipalitie Collectors
- Advertisement -

రాష్ర్టంలోని పురపాలక సంస్ధల్లోని అభివృద్ది కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఈరోజు విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అందించేందుకు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న పురపాలక సంస్ధల పరిధిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు నూతనంగా మరో 40 పురపాలక సంస్థలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, పరిపాలనా సౌకర్యార్ధం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్ వంటి అనేక మేజర్ గ్రామపంచాయితీలను పట్టణ స్థానిక సంస్థలుగా మార్చాలని వినతులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే చాల పట్టణాల మద్యలో మేజర్ గ్రామ పంచాయితీలున్నాయని, వీటి వలన వివిధ పథకాల అమలు, అనుమతులు, పరిపాలనా పద్దతుల్లోని భిన్నత్వం వలన ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం నూతన పురపాలికలు, గ్రామ పంచాయితీల వీలీనం కోసం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వలన అయా పట్టణాల్లోనీ పెరుగుతున్న పట్టణీకరణ సమస్యలను ఎదుర్కోనేందుకు అవకాశం ఉన్నదన్నారు. ఈ మేరకు కలెక్టర్లు స్థానికంగా ఉన్న స్ధానిక పరిస్ధితులకు అనుకూలంగా నివేధికను అందించాలన్నారు.

ముఖ్యం పట్టణాలకు అనుకుని ఉన్న గ్రామాలను కలుపుకుని, ఒక క్రమానుగత పట్టణీకరణ జరిగేందుకు అవసరం అయిన పలు చర్యలను మంత్రి ఈ విడియో కాన్ఫరెన్సులో వివరించారు. ప్రస్తుతం ఉన్న పురపాలక సంస్థలకు పరిధిని మరింత విస్తరించడంతో పాటు, నూతన పురపాలికలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. నూతన పురపాలక సంస్థల ఏర్పాటుకు సంబంధించి కనీసం 15 వేల జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలను గుర్తించాలని కలెక్టర్లకు అదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయితీలను వివరాలు అందజేయాలన్నారు.

KTR Video Conference With Municipalitie Collectors

దీంతోపాటు ప్రస్తుతం ఉన్న పురపాలక సంస్థల పరిధిని మరింత విస్తరించేందుకు, వాటి చుట్టు 3 నుంచి 5 కీలోమీటర్ల పరిధిలోని గ్రామాలను పట్టణాల్లో వీలీనం తెలిపారు. ప్రస్తుతం పంచాయితీల కాలపరిమితి వచ్చే యేడాది జూలై నెలలో ముగియనున్న నేపథ్యంలో, ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలను ఢీనోటిపై చేసి, చట్టబద్ధంగా వాటిని తిరిగి పురపాలక సంస్థలు నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రస్తుతము ఉన్న చట్టం ప్రకారం తీసుకోవలసిన చర్యలను మంత్రి కలెక్టర్లకు వివరించారు. ఈ మెత్తం ప్రక్రియలో సాధ్యమైనన్ని ఎక్కువ గ్రామ పంచాయతీల నుంచి నూతన పురపాలక సంస్ధల ఏర్పాటు, ప్రస్తుతం పురపాలికల్లో వీలీనం కోసం తీర్మానం తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ విషయంలో స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు.

స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి స్వచ్చసర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇందుకోసం అన్ని మున్సిపల్ కమీషనర్లు, చైర్మన్లతో కలిపి ప్రత్యేకంగా అవగాహాణ సదస్సు ఎర్పాటు చేయాన్నారు. ఈ సదర్భంగా అకాడెమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2018 cd ని విడుదల చేశారు.

గత రంగుల్లోనూ తెలంగాణకు చెందిన హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట వంటి పట్టణాలు మంచి స్థానాలను సంపాదించాయన్నారు. అయితే ఈసారి స్వచ్చసర్వేక్షణ్లో కొన్ని మార్పులు చేశారన్నారు. పారిశుద్ద్యం, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టండం ద్వారా తెలంగాణ పట్టణాల ర్యాకింగ్ మరింత పెరిగే అవకాశముందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా అకాడెమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ విషయంలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తోపాటు పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సిడియంఏ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -