ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..

146
- Advertisement -

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. కేటీఆర్‌ కృషితో ఒక్క రోజే తెలంగాణలో 4 సంస్థలు పెట్టుబడులు ప్రకటించాయి. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా కంపెనీలు కేటీఆర్‌తో సమావేశం అనంతరం తమ నిర్ణయాలు ప్రకటించాయి.

ఇందులో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories)లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ 1750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అలాగే న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ లో సుమారు 150 కోట్ల రూపాయల(USD 20 million) పెట్టుబడికి సిద్దమైంది. మరో కంపెనీ యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. క్యూరియా గ్లోబల్ హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటుతో 200 హై స్కిల్లిడ్ ఉద్యోగాలు కల్పనకు ముందుకు వచ్చింది.

- Advertisement -