KTR:బీజేపీ వంద అబద్దాలు సీడీ ఆవిష్కరణ..

28
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన “బీజేపీ వంద అబద్దాలు” బుక్ లెట్, సీడీనీ గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాలుగు నెలలుగా బీజేపీ వైఫల్యాలను బట్టబయలు చేస్తూ వస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లుగా ఉన్న మన్నె క్రిషాంక్ గారు, వై.సతీష్ రెడ్డి గారు, జగన్ మోహస్ రావు గారు, దినేష్ చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోడీ సర్కారు ఎలా మోసం చేసింది..? తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించారు. బీజేపీ తప్పులను ప్రతీరోజు బయటపెడుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారంగా మారిన జీఎస్టీ, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం, అందరికీ ఇల్లు, విభజన హామీల అమలు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు.. బీజేపీ నాయకుల అసలు రూపాన్ని ఈ క్యాంపెయిన్ లో బయటపెట్టడం జరిగింది. సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన “బీజేపీ వంద అబద్దాలు” క్యాంపెయిన్ ను మంత్రి కేటీఆర్ గారు అభినందించారు. అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచారన్నారు. బుక్ లెట్, సీడీ ద్వారా బీజేపీ తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.

Also Read:ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -