తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పాల్గొన్నారు. అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం పోరాడుతుందన్నారు.
హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు… కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎనిమిది రూపాయలు ఉన్న హమాలీ కూలీ ఆయ హయాంలోనే 26 రూపాయలకు చేరిందన్నారు.
కరోనా కాలంలో కెసిఆర్ ప్రెస్ మీట్ కి తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురు చూశారు. ఆయన చెప్పే మాట వినాలి అని చూశారు.. 35 లక్షల మంది వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అన్న కేసీఆర్ గారు, మనసున్న ముఖ్యమంత్రిగా, కార్మిక పక్షపాతిగా కరోనా కాలంలో వలస కార్మికులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సహాయం చేసి, భోజనం పెట్టి ప్రత్యేకంగా రైళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందర్నీ స్వస్థలాలకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే. అది కేసీఆర్ నాయకత్వం. కార్మికుల పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమ అన్నారు.
వలస కార్మికులు తెలంగాణ వాళ్లు కాదని తెలిసినా, వాళ్ళు ఎవరూ తనకు ఓటు వేయరని తెలిసినా కూడా మనసున్న ముఖ్యమంత్రిగా కార్మిక పక్షపాతిగా కెసిఆర్ గారు వాళ్ల కోసం పనిచేశారు. 2004లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా వేలాది ఇండ్లను కార్మిక కేసీఆర్ గారు మంజూరు చేశారు
అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2005వ సంవత్సరంలోనే కార్మిక శాఖ మంత్రిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పించి అర్జున్ సైన్ గుప్తా అనే ఆర్థికవేత్త ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని అందులో మెంబర్ గా చేసి ఒక నివేదిక తయారుచేయించారు.
సఫాయి అన్నా నీకు సలాం అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరు. సఫారీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఎన్నో పథకాలను అమలు చేశారు. ఒక్క జిహెచ్ఎంసి లోనే సఫాయి కార్మికులకు మూడుసార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే..ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ గారు అదే అంగన్వాడీ టీచర్లకు 4500 ఉన్న జీతాన్ని 13,650 కి పెంచారు. మినీ అంగన్వాడి టీచర్లకు 2200గా ఉన్న జీతాన్ని 7800 చేశారు అన్నారు.
2014లో ఆశా వర్కర్లకు 2500 రూపాయల జీతం ఉంటే దాన్ని 9750 కు పెంచారు. ఆర్పి లకు ఆరువేల రూపాయల జీతం ఇచ్చారు. అయితే ఆరు నెలల నుంచి ఆర్పి లకు జీతాలు దిక్కులేవు. మున్సిపల్ కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు. అయినా ముఖ్యమంత్రి ఫస్ట్ తారీకు జీతాలు ఇస్తుందని అబద్ధాలు చెబుతున్నాడు.
9000 ఉన్న తమ జీతాన్ని 27 వేలకు పెంచి పెంచింది కేసీఆర్ అని ఒక హోంగార్డు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని చెప్పాడు. కెసిఆర్ గారు ఉంటే పోలీస్ వారితో సమానంగా తమకు పేస్కేలు ఉండేదని ఆ హోంగార్డ్ చెప్పాడు .. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ తెలంగాణ ఉద్యోగులకు ఇస్తానని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం 73% జీతాలను తెలంగాణ ఉద్యోగులకు పెంచారు.
భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం గా తెలంగాణను కేసీఆర్ నిలిపారు…మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 12 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఆర్సిని వర్తింప చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారత దేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే
ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి వర్తింప చేయలేదు. ఒక కేసీఆర్ గారు వచ్చినంకనే అది ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇవ్వక తప్పదు.గుడి పూజారులకు మస్జిద్ల మౌలానా, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారత దేశంలో కేసీఆర్ అన్నారు.
కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా భారతదేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదు. నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికుల కు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ ఒక్కడే ..భవన నిర్మాణ కార్మికులకు బీమాతో ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ , క్యాబ్ ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా చ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు అన్న కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మిక విభాగం మీద ఉందన్నారు.
Also Read:పింక్ బుక్‌లో రాస్తున్నాం…పోలీసులు జాగ్రత్త!