తెలంగాణ తల్లి రూపాన్ని మార్చమని ఎవరడిగారు?

1
- Advertisement -

హంతకులే సంతాప సభలు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పైన కూడా కుట్రలు చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం మరియు పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ తల్లి ఔనత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా పేదరాలి లెక్క రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరుగా రూపొందించిన ఈ దివాళకోరు పాలకులు తమ భావ దారిత్యాన్ని చూపించారు అని మండిపడ్డారు. తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరు… కానీ తెలంగాణ తల్లిని మార్చిన దరిద్రులు తెలంగాణలో ఉన్నారు…తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చమని ఈ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు? ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లులు మారుతారా?, ప్రభుత్వాలు మారినప్పుడు భరతమాత గానీ, తెలుగు తల్లి గానీ మారిందా? చెప్పాలన్నారు.

అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ బతుకమ్మను కూడా నాశనం చేశారన్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక పార్టీ కోసం సంబంధించినది కాదు; మొత్తం తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తపరిచిన గొప్ప స్ఫూర్తి…. ఇప్పటికే తెలంగాణలో బతుకమ్మ చీరలను మాయం చేసిన ప్రభుత్వం, తెలంగాణ పథకాలను మాయం చేసిన ప్రభుత్వం, మొత్తం తెలంగాణనే మాయం చేయాలని కుట్ర చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Also Read:ఇది ఎలాంటి వంచన?; కేటీఆర్

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం ముందు ఉన్న రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని గాంధీభవన్ కి పంపిస్తాం అన్నారు. ఇదే విధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ పేరుతో మోసం చేస్తున్నారో, ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ పంపిస్తాం.. కాంగ్రెస్ తల్లి భస్మాసుర హస్తం చూపిస్తూ అభయహస్తం అంటూ మోసం చేస్తుందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది ఇదే కాంగ్రెస్ తల్లి… తెలంగాణ ప్రజలు మోసపడేటట్లు చేసిన కాంగ్రెస్ తల్లిని కచ్చితంగా గాంధీభవన్ కి పంపిస్తాం అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పంపించడం ఖాయం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు.

- Advertisement -