మీరు సిద్ధమా..?నాగ్,మహేష్‌కు కేటీఆర్ ట్వీట్..

336
- Advertisement -

చేనేతకు చేయూతనిచ్చేందుకు చేనేత, జౌళి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. చేనేతకు పూర్వవైభవం తెచ్చేందుకు జాతీయ స్ధాయిలో కృషిచేస్తున్న కేటీఆర్….ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందరికి చేప్పే ముందు స్వయంగా పాటించాలని నిర్ణయించుకున్న కేటీఆర్…సోమవారం చేనేత వస్ర్తాలను ధరించి సచివాలయంలోని కార్యాలయానికి వచ్చారు. ఇక అంతేగాదు ప్రజాప్రతినిధులందరికీ చేనేత వస్త్రాలను అందించిన కేటీఆర్….చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేయాలని కోరారు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్..సెలబ్రిటీలకు ట్విట్ ద్వారా సూచించారు. చేనేతకు చేయూత నందించేందుకు నేను సిద్ధం…మీరు సిద్ధమా అంటూ ట్విట్టర్ ద్వారా సెలబ్రిటీలను ప్రశ్నించారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మన్మథుడు నాగార్జున, మంచు లక్ష్మి, వివేక్ ఒబెరాయ్, సమంత, సానియా మీర్జా సహా టాలీవుడ్ స్టార్లు, క్రీడాకారులకు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని సూచించారు.

 KTR tweets to Celebs on handloom clothes

‘‘చేనేత కార్మికులను ఆదుకోవడానికి నేను చేనేత వస్త్రాలను ధరిస్తున్నా.. మరి మీరు ధరిస్తారా?’’ అంటూ ట్విట్ చేశారు. ఇక, ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు కమల్ హాసన్, సానియా మీర్జా వెంటనే రీట్విట్ చేశారు. తాను ఈ సవాల్‌కు సిద్ధమని, తన తండ్రి తన జీవితాంతం చేనేత వస్త్రాలనే ధరించారని కమల్ స్పందించారు.

 KTR tweets to Celebs on handloom clothes

సానియా మీర్జా సైతం ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తై హైదరాబాద్ రాగానే చేనేత వస్త్రాలనే ధరిస్తానని చెప్పింది. అంతేగాకుండా సహ క్రీడాకారులైన మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, షట్లర్ పీవీ సింధు, రానా దగ్గుబాటిలకు ఈ సవాల్‌ను విసిరింది సానియా. మరి ఎంతమంది సెలబ్రిటీలు ఈ సవాల్‌ను స్వీకరిస్తారో చూడాలి..

 KTR tweets to Celebs on handloom clothes

- Advertisement -