చైనా టు లండన్….వయా జర్మనీ

131
First Train From Beijing To London

చైనా నుంచి బ్రిటన్‌కు సరకు రవాణా మరింత వేగవంతం కానుంది. చైనాలో హోల్‌సేల్‌ మార్కెట్‌ పట్టణమైన జిజెంగ్‌ పట్టణం నుంచి లండన్‌కు రైలులో సరుకులు రవాణా చేయనున్నారు. జిజియాంగ్‌ ప్రావిన్స్‌లోని యివు అనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ పట్టణం నుంచి లండన్‌కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఈ రైలు దాదాపు 7,500 మైళ్లు.. (12,000 కిలోమీటర్లు) ప్రయాణించనుంది.

 First Train From Beijing To London

18 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో కజకిస్తాన్‌, రష్యా, బెలారస్‌, పోలాండ్‌, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ మీదుగా వెళ్లి లండన్‌ చేరుకోనుంది. చైనాతో మరోసారి సంబంధాలు పెట్టుకోవడం స్వర్ణంగా మిగిలిపోతుందని బ్రిటన్‌ కొత్త ప్రధాని థెరిసా మే అభివర్ణించారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో చైనాతో ఈ సంబంధాలు తమకు చాలా లబ్ధిని చేకూరుస్తాయని ఆమె అన్నారు.గతంలో బ్రిటన్‌ ప్రధానిగా డేవిడ్‌ కామరూన్‌ చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా-లండన్‌ రైలు ప్రారంభమైంది.

 First Train From Beijing To London

 First Train From Beijing To London