కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద నెలకొన్ని హింసపై స్పందించారు మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే నిదర్శనమని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అనుచిత ప్రచారం చేయొద్దని…ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టాలని కోరారు కేటీఆర్.
ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని తప్పుబట్టారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని డీకే శివకుమార్ కోరారు.
ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్.. ఓ వర్గాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో వివావాదస్పద పోస్టు పెట్టడంతో వివాదం రాజుకుంది. దీంతో ఆందోళనకారులు ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకుని విధ్వంసం సృష్టించారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. ఆందోళనకారుల దాడిలో ఏసీపీ సహా 60 మంది గాయపడ్డారు.