అనాథలను ఆదుకున్న కేటీఆర్‌..

239
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఆపదలో ఉన్నామని, తమను ఆదుకోవాలని పలువురు మంత్రి కేటీఆర్‌ను సంప్రదించగా మానవతా దృక్పథంతో వారికి సహాయాన్ని అందించిన కేటీఆర్‌ తాజాగా మరో ముగ్గురి అనాథ పిల్లలకు అండగా నిలిచారు. కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా స్పందించి ముగ్గురు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్సిచారు. అమ్మానాన్నలు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న సుబ్బలక్ష్మి, అనూష, రంజిత్‌లకు మంతి కేటీఆర్‌ అండగా నిలిచారు.

ktr

ఆర్థికస్థోమత లేక బంధువులు సైతం ఏమీచేయలేని దుస్థితిలో ఉన్న ఆ చిన్నారులు అనాథలుగా మారడంతో విశ్వకర్మ సంఘం నేతలు మంత్రికి చిన్నారుల పరిస్థితిపై ట్వీట్‌ చేశారు. అయితే కేటీఆర్‌ ఆ ట్వీట్ స్పందించడంతో పాటు వారి ఆదుకోవాలని బుధవారం కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ మేరకు గురువారం కలెక్టర్ చిన్నారులను తన కార్యాలయా నికి పిలిపించుకుని తక్షణ సాయం కింద రూ.20వేలు అందించారు. ఆపద్బంధు కింద రూ.50వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రంజిత్ ను బీసీ సంక్షేమ శాఖ పాఠశాలలో చేర్చుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజానజీమ్ అలీని సూచించారు. సుబ్బలక్ష్మి, అనూషలను సాంఘిక సంక్షేమ రెసిడె న్షియల్ గురుకుల కళాశాలలో డిగ్రీ కోసం అడ్మిషన్ తీసుకోవాలని గురుకులాల డీసీవో శ్రీనివాస్‌రావును ఆదేశించారు.

- Advertisement -