కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు,వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని దుయ్యబట్టారు.
పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదు .. అరకొర రుణమాఫీ,ఆచూకీ లేని రైతు భరోసా ,అందని రైతుబీమా , ప్రాజెక్టులు పడావు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం ..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోంది అన్నారు.
వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నది అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి
రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు
విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది
వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు
విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు
వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు
పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం… pic.twitter.com/PxNAGvvlCi
— KTR (@KTRBRS) June 13, 2025
Also Read:విమాన ప్రమాదం..కేసీఆర్ దిగ్బ్రాంతి

