ఇది బీజేపీ మార్క్ అభివృద్ధి: కేటీఆర్

7
- Advertisement -

హైదరాబాద్‌లోని రూ. 430 కోట్ల చర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా, ఢిల్లీ విమానాశ్రయంలోని పైకప్పులైనా — బీజేపీ మార్క్ ‘అభివృద్ధి’ ఎంతగా ఉందో తెలియజేయడానికి ఓ చిన్న వర్షం చాలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

ఇది అదే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రూఫ్ కాదా గత సంవత్సరం కూలిపోయిందని చెప్పినది? ఇప్పుడు కూడా ఒక్క వానకే అంతా కూలిపోయిందా? అని ప్రశ్నించారు. ఒక పైకప్పు సరిగ్గా కట్టలేని పరిస్థితిలో ఉన్నవారు, కాలేశ్వరం గురించి కామెంట్లు చేయడం నిజంగా దయనీయంగా ఉందని ఎద్దేవా చేశారు.

బీజేపీ పరిచయం చేసిన ఈ అద్భుతమైన “శేప్‌షిఫ్టర్ రూఫ్స్” మోడల్‌ని ఏజెన్సీలు ఎప్పుడు గమనిస్తాయోనని ఆశ్చర్యం వేస్తోంది అన్నారు.

 

Also Read:సినీ రంగానికి సహకరిస్తాం: ఏపీ మంత్రి

- Advertisement -