సైనికులకు సలాం చేసిన కేటీఆర్..

225
ktr
- Advertisement -

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. ఎవరైన ఆపదలో ఉన్నరని తెలియగానే వెంటనే స్పందించి సహాయాన్ని అందిస్తారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా ఎందరికో సాయన్ని అందించారు. అలానే ఆర్మీ డే సందర్భంగా.. భారత జవాన్లకు గౌరవం తెలుపుతూ ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు.

జవాన్ల ధైర్య, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నాను. మన యొక్క సైనికులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

1949 జనవరి 15న అప్పటి భారత కమాండర్ ఇన్ ఛీఫ్.. జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచీ అధికారాలను లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప పొందారు. తద్వారా విదేశీ సైనిక పాలన నుంచీ దేశానికి విముక్తి లభించినట్లైంది. ఆ సందర్భంగా ఏటా జనవరి 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు.

- Advertisement -