టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా వరంగల్‌కు వస్తున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అన్నిఏర్పాట్లు చేశాయి. జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో రెండుచోట్ల జరిగే సభల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు జనగామలోని ప్రిస్టన్ మైదానంలో ఏర్పాటుచేసిన జనగామ,పాలకుర్తి,స్టేషన్ ఘన్‌పూర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. వరంగల్ జిల్లా ప్రారంభం పెంబర్తి నుండే కేటీఆర్‌కు బైక్ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు కార్యకర్తలు.
వరంగల్ పర్యటనలో భాగంగా బాలసముద్రంలో వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. మడికొండ నుంచి హన్మకొండ బాలసముద్రం వరకు ఆరేడు కిలోమీటర్ల మేర శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
రెండు జిల్లాల్లో జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, వొడితల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఏర్పాట్లు పూర్తిచేశారు.