జీవన్‌ రెడ్డితో కేటీఆర్ భేటీ!

5
- Advertisement -

జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఇవాళ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు కేటీఆర్.

ఇప్పటికే జీవన్‌రెడ్డితో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్‌కు చెందిన ప్రముఖ నేతలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సైతం జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు.

జగిత్యాల రాజకీయాల్లో జీవన్‌రెడ్డి కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ కావచ్చని భావిస్తున్నారు.

Also Read:ఆధునిక వైద్యం..వ్యాధులను నయం చేయగలదా?

- Advertisement -