ప్రేమ.. ఇష్క్.. కాదల్… భాష మారుతుందేమో కానీ భావం ఎప్పుడూ మారదు. ఏ భాషలో చెప్పినా ప్రేమ ప్రేమే. అందుకే, ఎన్ని ప్రేమకథలొచ్చినా ప్రేక్షకులెప్పుడూ ఆసక్తి కనబరుస్తారు. వాళ్ల ఆసక్తిని మరింత పెంచుతూ… ‘కాదలి’ చిత్ర బృందం సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటోంది. హరీశ్ కల్యాణ్, సాయి రోనక్, పూజ కె.దోషి ముఖ్యతారలుగా అనగనగన ఫిల్మ్ కంపెనీ (ఏఎఫ్‌సీ) పతాకంపై పట్టాభి ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘కాదలి’.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వనమాలి రాసిన ‘ఎలా ఎలా ఎలా తేల్చాలి’ అనే పాటను స్టార్ హీరోయిన్ సమంత తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా విడుదల చేయగా టీజర్‌ను దగ్గుబాటి రానా ఇటీవలె విడుదల చేశారు.
తాజాగా చిత్ర ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. మంత్రి కేటీఆర్,మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ సినిమా ఆడియోని ఈ నెల 6న లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పట్టాభి ఆర్.చిలుకూరి మాట్లాడుతూ.. “మా “కాదలి” టైటిల్ కు విశేషమైన స్పందన వచ్చింది. మినిష్టర్ కేటీఆర్ మా టైటిల్ లోగోను విడుదల చేసినందుకే చాలా సంతోషించాం. ఇప్పుడు ఆయన మా ఆడియో వేడుకకు కూడా విచ్చేయనుండడం పట్టరాని ఆనందాన్ని కలిగిస్తోంది. కేటీఆర్‌తోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు. మా చిన్న చిత్రానికి ఇంతటి భారీ పబ్లిసిటీ లభిస్తుండడం, స్టార్ హీరోహీరోయిన్లతోపాటు మా కీటీయార్ గారు కూడా సపోర్ట్ చేస్తుండడం వల్ల “కాదలి” ఇప్పటికే కొన్ని లక్షల మంది జనాలకి రీచ్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.