సిట్ విచారణకు కేటీఆర్..న్యాయవాదులను అనుమతించాలి

6
- Advertisement -

4 గంటల 27 నిమిషాలకు సిట్ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు అన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పారు… కనీసం 24 గంటలు కూడా సమయం ఇవ్వలేదు అన్నారు. రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తోంది ప్రభుత్వం..మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఇలాగే నోటీసులు ఇచ్చారు అన్నారు.

ఇప్పుడు కేటీఆర్ కు కూడా ఇచ్చారు..ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది..ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ రేపు హాజరవుతారు…మీకు చెప్పమని కేటీఆర్ చెప్పారు…పెద్ద ఎత్తున ప్రజలనుంచి ప్రభుత్వం పై ఒత్తిడి వస్తుంది అన్నారు.

దీన్ని దృష్టి మరల్చేందుకు ఇలాంటి కుట్రలు చేస్తోంది ప్రభుత్వం..ప్రశ్నించే వారిని గొంతు మూసేందుకు ప్రభుత్వం చేస్తుంది..ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొంటాం…చట్టాలు న్యాయాలపై మాకు నమ్మకం గౌరవం ఉంది అన్నారు.

మొన్న లాయర్లను అనుమతించలేదు..రేపు కచ్చితంగా కేటీఆర్ విచారణకు న్యాయవాదులను అనుమతించాలి..ఎంత సేపు విచారిస్తారో చెప్పాలి అన్నారు. రెండు మూడు గంటలు మాత్రమే విచారణ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు..ఒకవేళ ఆలస్యం చేస్తే దాని బట్టి వ్యవహరిస్తాం..ప్రతిపక్షాల పైన కుట్ర పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నారు.

Also Read:రామ్ చరణ్..పెద్ది లేటెస్ట్ అప్‌డేట్!

- Advertisement -