తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీత రచయిత మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, తెలంగాణ వికాస సమితి గౌరవాధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగా బాలు, యువ నాయకుడు ముఠా జై సింహ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
2024-25 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, కథా రచయిత చమన్ సింగ్ మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే 2025-26 సంవత్సరానికి గాను ప్రముఖ సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన పలువురిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. ప్రముఖ రచయిత్రి తిరునగరి దేవకీదేవి, ప్రముఖ గాయకుడు కవ్వంపల్లి స్వామి ఈ ప్రత్యేక సత్కారాలను అందుకోనున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది.

