టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్ ఇవాళ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని భావించిన కేసీఆర్…కేటీఆర్‌కు కీలకబాధ్యతలు అప్పజెప్పారు. అంతేగాదు ఇక నుండి కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండనున్నారు కేటీఆర్. ఇందుకోసం ప్రస్తుతం ఆయన ప్రగతిభవన్‌లో ఉంటుండగా ఇల్లు కూడా మారే అవకాశముందని టాక్.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ నెల 17న తెలంగాణభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు కేటీఆర్. కేటీఆర్ కోసం భవన్‌లో ప్రత్యేక చాంబర్‌ను సిద్ధంచేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రోజుల్లో పార్టీ కార్యాలయానికి వచ్చి.. నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. నెలలో కనీసం 15, 20 రోజలు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు కేటీఆర్.
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు హరీష్ రావు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి శాసనసభ ఎన్నికల్లో తామిద్దరం కలిసి పనిచేశామని, రాష్ట్రాన్ని, పార్టీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులోనూ ఇద్దరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.