రామన్న బాటలోనే మేముసైతం..మంత్రుల ప్రకటన

224
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ తన బర్త్ డే సందర్భంగా స్వంత ఖర్చులతో 100 అంబులెన్స్‌లను అందిస్తానని ప్రకటన చేశారు. కేటీఆర్ ప్రకటనను స్పూర్తిగా తీసుకున్న టీఆర్ఎస్ నేతలు భారీగా స్పందించారు. అంతా కలిసి 100 అంబులెన్స్‌లను అందించేందుకు సిద్ధమయ్యారు.

తన పుట్టినరోజు సందర్భంగా ప్రగతి భవన్‌ వచ్చిన ఈటల రాజేందర్‌తో ఆరు అంబులెన్స్‌లను పార్టీ తరపున తన స్వంత ఖర్చులతో ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపిన కేటీఆర్ వాటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలకు ఉపయోగించుకోవాలని కోరారు.

కేటీఆర్‌ను అభినందించిన ఈటల.. తాను కూడా తన నియోజకవర్గం, కరీనంగర్‌ జిల్లా పార్టీ తరఫున 5 అంబులెన్స్‌లను సమకూరుస్తానని చెప్పారు.
వీరిబాటలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కూడా సూర్యాపేట, భువనగిరి యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఆరు అంబులెన్స్‌లను సమకూరుస్తామని చెప్పారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ, నేతల తరఫున 11 అంబులెన్స్‌లను సమకూరుస్తామని ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌ తదితరులతో కలిసి తమ వరంగల్‌ జిల్లా తరఫున 6 అంబులెన్స్‌లను ఇస్తామని హామీఇచ్చారు. ఇలా వివిధ జిల్లాలకు చెందిన నేతలంతా తమవంతుగా స్వంత ఖర్చులతో అంబులెన్స్‌లను సమకూర్చుతామని ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -