తెలంగాణలో మహిళా ఆంట్రప్రెన్యూర్ల సంఖ్య మరింత పెరగాలన్నారు ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్. ప్రపంచ పారిశ్రామికవేత్తల ముగింపు సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ పై విధంగా స్పందించారు.
ఈ సందర్బంగా జీఈ సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఙతలు తెలిపారు. ఆంత్రప్రెన్యూర్లకు జీఈ సదస్సు మంచి వేదికలా నిలిచిందని, ఈ సదస్సు ద్వారా అనేక విషయాలను తెసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళా ఆంట్రప్రెన్యూర్లకు ప్రోత్సాహాన్నిస్తూ.. హైదరాబాదులో మరిన్ని ప్రపంచ సదస్సులను నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
జీఈ సదస్సు విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని, 53డిస్కషన్లలో 200 మంది స్పీకర్లు మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. ..ఈ సదస్సుతో భారత్- అమెరికా మైత్రి మరింత బలపడుతుందని కేటీఆర్ అన్నారు. కాగా.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న జీఈ సదస్సు ఈ రోజుతో ముగియనుంది.