రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలు విడుదల

352
harishrao
- Advertisement -

సిద్దిపేట జిల్లా ప్రజల కల సాకారమైంది. బీడు భూములు ఉన్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తొలుత రంగనాయక సాగర్‌ గుట్టపై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కేటీఆర్,హరీష్ రావు. అనంతరం రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు మోటార్ స్వీఛాన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.

సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ ..11లో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌కు 88.25 టిఎంసిల నీటిని తరలిస్తారు.

narega

రిజర్వాయర్‌కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. అనంతగిరి సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పంపులు ఆన్‌ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్‌కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

- Advertisement -