వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తిపై పోలీసులు భౌతికదాడికి పాల్పడటంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఈ ఘటనను ఓ నెటిజన్ కేటీఆర్‌కు షేర్ చేయగా ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ,హోంమంత్రిని కోరారు.
ఎటువంటి పరిస్ధితుల్లో పోలీసులు ప్రవర్తించిన తీరు అంగీకారయోగ్యం కాదని ఇలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వేల మంది పోలీసులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని కానీ ఇలాంటి వారి కారణంగా మిగితా వారి శ్రమ వృథా అవుతుందన్నారు.
ఇదిఇలా ఉండగా వనపర్తిలో ఓ కొడుకు ముందే తండ్రిని చితకబాదారు పోలీసులు. అంకుల్ కొట్టొద్దంటూ బతిలాడిన వినని పోలీసులు ఆ పిల్లాడితో సహా తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రాగా కేటీఆర్ వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు.
Dear HM Mahmood Ali Saab & @TelanganaDGP Garu, this attitude of police is unacceptable in ANY circumstances
Request you to take the strictest action on incidents such as this
All the exceptionally good work of thousands of policemen is undone by erratic behaviour of few https://t.co/CaOAU9ercw
— KTR (@KTRTRS) April 2, 2020