గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోస్ అనే మహిళపై అత్యంత పాశవికంగా రేప్ చేసి కుటుంబాన్ని చంపిన నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిని తాజా వార్త సంచలనంగా మారింది. బానోస్ అత్యాచార నిందితుల విడుదల వెనుక ఉన్నది రాష్ట్రప్రభుత్వం కాదని కేంద్రప్రభుత్వం ఉన్నదని పలు జాతీయ వార్తా సంస్థలు ప్రచురించాయి. కాగా దీనిపై తెలంగాణ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.
ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన…బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ సంస్కారవంతులైన రేపిస్టులను విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య అని అన్నారు. రేపిస్టులు, పసివాళ్లను చంపే దుర్మార్గులను కేవలం రాజకీయ లబ్ధి కోసం విడుదల చేయడం అనేది.. బీజేపీకి నీచమైన విలువలు ఉన్నా కూడా ఈ పని మాత్రం నీచాతినీచం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ.. కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నారు.