యువ సంగ్రామం..రేవంత్‌కి కేటీఆర్ సవాల్

1
- Advertisement -

టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్ అనే కంపెనీ ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్‌ను పంపింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరూర్‌ నగర్‌ యువ సంగ్రామ సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఓ ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను పంపడం ఇదే మొదటిసారి అన్నారు.

ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా…దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా రేవంత్ రెడ్డి …ఎవడు బ్రతకాలో, ఎవడు సావాలో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు అన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి వచ్చి బిస్కెట్లు తిని మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేశాడు…కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు పీకేస్తే ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు..ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ? అని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు…అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు విడుదల చేశారు…ఓటు కొట్టు.. జాబ్ పట్టు అని ఆఫర్ ఇచ్చారు..ఇవాళ ఉలుకు లేదు.. పలుకు లేదు…జాబులు నింపడం లేదు కానీ రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు…జాబ్ క్యాలెండర్‌కు మాత్రం నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు సై సై అంటున్నారు అన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా…అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా.. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

Also Read:హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్!

ఒక జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది…ఒక నక్క ఎవరినీ మోసం చేయనని ప్రమాణం చేసిందట, తోటి జంతువులను ఇక చంపనని ఒక పులి పశ్చాత్తాపపడిందట…ఇవాళ వీళ్ల మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురుకు మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో గుర్తు తెచ్చుకోండి.పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమను కురిపిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్…ఈ యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇస్తే, ఒక్క హామీ కూడా నెరవేరలేదు అన్నారు.

- Advertisement -