తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి విశేషస్పందన

227
KTR strikes gold
- Advertisement -

రాష్ట్రంలో ఆహారశుద్ధిరంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో భాగంగా పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి  జయేశ్ రంజన్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందాలు కుదర్చుకున్న సంస్ధలలో బికానీర్ వాలా,ప్రయాగ్,న్యూటీయన్స్ ఫుడ్,  కనోరియా గ్రూప్‌కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బేకరీ,బ్లూ క్రాఫ్టో ఆగ్రో,సంప్రీ గ్రూప్, క్రీంలైన్ డెయిరీ, పుష్ప ఫుడ్ సంస్థలు  ఉన్నాయి.

KTR strikes gold

ఈ సంస్ధల ద్వారా రాష్ట్రానికి రూ.1250 కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారు 38 వందల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇక ఇప్పటికే జహీరాబాద్‌లో రూ. 6,000 కోట్ల పెట్టుబడులతో సమీకృత ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుచేసేందుకు దక్షిణ్ ఆగ్రోపొలిస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది.  జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 300 ఎకరాల్లో సమీకృత ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

దీనిద్వారా 4,000 మంది మహిళలకు, 1,000 మంది పురుషులకు మొత్తం 5,000మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ రూ. 2.5 వేల కోట్లను ఆహారశుద్ధి యూనిట్ల మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు వెచ్చిస్తుంది. మరో రూ.3.5వేల కోట్లతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేసి, రైతులకు వ్యవసాయరంగంలో మెళకువలు నేర్పటం, వ్యవసాయోత్పత్తుల ఆధునీకరణ వంటి అంశాలపైన వెచ్చిస్తుంది. ఈ పెట్టుబడుల ద్వారా 25 వేల మంది రైతులకు నేరుగా వ్యవసాయరంగంలో సహకారం అందిస్తుందని మంత్రి   వెల్లడించారు.

KTR strikes gold

- Advertisement -