ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: కేటీఆర్

513
ktr medaram jathara
- Advertisement -

అసియా ఖండంలోనే అతి పెద్ద జాత‌ర‌, తెలంగాణ కుంభ‌మేళా, అతి నిష్ఠ క‌లిగిన ఆదివాసీ బిడ్డ‌ల, అడ‌విత‌ల్లుల జాత‌ర మేడారం జాత‌ర‌ను ప్లాస్టిక్ ర‌హితంగా నిర్వ‌హించుకుందామ‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణ‌, మున్సిప‌ల్ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మేడారం జాత‌ర‌లో ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను వాడొద్దంటూ… ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, ప్ర‌త్యేకంగా రూపొందించిన డాక్యుమెంట‌రీ (ఆడియో విజువ‌ల్)ని, ఎవీని ప్ర‌ద‌ర్శించే ఎల్ ఇ డి వాహ‌నాన్నిమంగ‌ళ‌వారం హ‌న్మ‌కొండ‌లోని ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్ క్యాంపు కార్యాల‌యంలో కెటిఆర్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించింద‌న్నారు. అందులో భాగంగానే, ఫిబ్ర‌వ‌రి 5,6,7,8 తేదీల్లో జ‌రిగే మేడారం జాత‌ర‌లో కూడా భ‌క్తులు ప్లాస్టిక్ ని వినియోగించ‌వ‌ద్ద‌న్నారు. ప్లాస్టిక్ కి బ‌దులు ప్ర‌త్యామ్నాయ వ‌స్తువుల‌ను మాత్ర‌మే వాడాల‌ని, ఇందుకు మేడారం వెళ్లే భ‌క్తులు స్వ‌చ్ఛందంగా స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్లిక్ నిషేధంపై ఎవీని రూపొందించి, విస్తృత ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డిని మంత్రి కెటిఆర్ అభినందించారు.

ప్లాస్టిక్ నిషేధంపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేలా రూపొందించిన డాక్యుమెంట‌రీ బాగుంద‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజ‌న‌, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజ‌య్య‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, దివ్యాంగుల స‌హ‌కార‌ సంస్థ చైర్మ‌న్ వాసుదేవ‌రెడ్డి, లింగాల ఘ‌న్ పూర్ జెడ్పీటీసీ గుడి వంశీధ‌ర్ రెడ్డి, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై స‌తీశ్ రెడ్డి, స్థానిక నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -