భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే..కేటీఆర్

66
ktr
- Advertisement -

జహీరాబాద్ లో ఎంజీ ఈవి పార్క్ ప్రారంబించడంతో పాటు,వాయు మోటర్స్, జడ్21 కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఐటి, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి కేటీఆర్ లాంచ్ చేసారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ…”ప్రపంచ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే” అని ప్ర‌స్తావించారు. గ్లోబల్ వార్మింగ్ ఫలితాలు ప్రస్తుతం అనుభవిస్తున్నాం అని అన్నారు. ఎలక్ట్రానిక్ అటోమోబైల్ రంగం చాలా విస్తరించింది,నిమ్జ్ లో ఎలక్ట్రానిక్ వాహానాల కంపెనిలు వస్తున్నాయి అని తెలిపారు.

ఉపాది కల్పనకోసమే పరిశ్రమలకు రాయితిలు ఇస్తున్నాం.. ఇందులో స్థానికులకు ఉపాదిలో ప్రాదన్యం ఇవ్వాలి అని వాక్యానించారు. అబ్దుల్ కాలం పేరుతో జహీరాబాద్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం… స్థానిక యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నాం అని పేర్కొన్నారు. తెలంగాన‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయ‌ద‌ని,రైతులను సంతృప్తి పరిచిన తరువాత నే భూమిని సేకరిస్తుందని,భూములు కోల్పోయిన వారి పిల్లలకు నిమ్జ్ లోనే ఉద్యోగాలు ఇచ్చేలా ప్లాన్ చెస్తాం అని తెలిపారు.

ఈ కార‌క్ర‌మం లో ఎంపీ లు బీబీ పాటిల్ ,సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -